← Back to news

దసరా రద్దీ.. NH-65పై ట్రాఫిక్ జామ్

By Prashanth· 6h ago· X

TG: హైదరాబాద్‌-విజయవాడ NH-65పై యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దసరా సెలవులు, వీకెండ్ రద్దీకి తోడు ఫాస్టాగ్ సమస్యలు, చౌటుప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. దీంతో సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో గమ్యస్థానాలకు చేరేందుకు గంటల సమయం పడుతోందని వాహనదారులు చెబుతున్నారు.

More in Current Affairs