← Back to news

TDP ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్స్.. వీడియో వైరల్

By Vishi· 14h ago

AP: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీల్లో ఎవరు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం కుదిరింది. ఈ టైంలో రాజాం టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ వీడియో వైరల్‌గా మారింది. జనసేన, బీజేపీలకు స్థానాలు కేటాయిస్తే, టీడీపీ వాళ్ళు ఆ పార్టీల్లో జాయిన్ చేసి అక్కడ కూడా మనమే పోటీ చేయాలంటూ ఆయన చెప్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఇప్పటికే తగిన ప్రాధాన్యం లేదంటూ డీలా పడ్డ జనసేన నేతలకు ఈ విషయం మరింత ఇబ్బంది కలిగిస్తోందనే చర్చ సాగుతోంది.

More in AP