Breaking: అభిజిత్ దీప్కే డిటైన్
CJP తిరంగా ర్యాలీకి పోలీసులు బ్రేక్ వేశారు. ఇంటినుండి బయలుదేరిన కొద్దిసేపటికే కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్కులో అభిజిత్ దీప్కేను డిటైన్ చేశారు. జంతర్‌మంతర్‌లో జాతీయ జెండా ఎగరేసి అరెస్టయిన అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు సపోర్ట్‌గా ఈ మార్చ్ ప్లాన్ చేశారు. అయితే సెక్షన్ 163 ఆంక్షల వల్ల పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అభిజిత్‌ను తీసుకెళ్తున్న టైమ్‌లో ప్రొటెస్టర్లు వాహనాన్ని అడ్డుకునేందుకు ట్రై చేసినప్పటికీ, భారీ బందోబస్తుతో ఏరియాను పూర్తిగా బ్లాక్ చేశారు.
