గద్వాలలో రక్తదాన శిబిరం

జోగులాంబ జిల్లా గద్వాల్ పట్టణంలోని జిల్లా BJP కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ 25ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని చేపట్టిన మోదీ@25 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా BJYM జిల్లా అధ్యక్షుడు బాబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. BJP జిల్లా యువ నాయకురాలు డీకే స్నిగ్ధ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం అత్యంత విలువైన మానవతా సేవ అని, ఒక్క యూనిట్ రక్తం ఒకరి ప్రాణాలను కాపాడగలదని ఆమె తెలిపారు.





