వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలపై లోకేష్ ఫైర్!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్‌ను కార్మిక సంఘాల నేతలు నిలదీశారు. దీంతో అక్కడ కాసేపు హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. లీడర్ల ప్రవర్తనపై లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "ఎందుకు అరుస్తున్నారు? నేను ఇక్కడ చనిపోయిన వారి ఫ్యామిలీస్‌తో మాట్లాడుతున్నాను. మీ కుటుంబంలో ఎవరూ చనిపోలేదు కదా" అంటూ కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.



