ఇంద్రుడిపై కంప్లైంట్.. కారణం?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ జిల్లాకు చెందిన సూరజ్ తివారీ.. భారీ వర్షాలకు ఇంద్రుడే కారణమంటూ రాష్ట్ర ప్రజా ఫిర్యాదుల పోర్టల్‌లో కంప్లైంట్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా ఇంద్రుడు వర్షాలు కురిపిస్తున్నాడని, రోడ్లు, ఫ్లడ్-ప్రోన్ ఏరియాలు నీట మునిగాయని కంప్లైంట్‌లో రాశారు. ఇంద్రుడి ఫోన్ నంబర్ తనకు తెలియదని, అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఇంద్రుడికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కంప్లైంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వర్షాల కారణంగా UPలో 56 మంది, హర్దోయ్‌లో ఏడుగురు మృతి చెందారు.

