రౌతులపూడిలో కనకదుర్గమ్మ బ్రహ్మోత్సవాలు

AP: కాకినాడ జిల్లా రౌతులపూడిలో శ్రీ కనకదుర్గ అమ్మవారి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీ శ్రీనివాస వర్తక సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎంపీపీ ఇట్టం శెట్టి భాస్కర్ బాబు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులతో కలిసి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించారు.



