← Back to news

UGC NET ఆన్సర్ కీ రిలీజ్.. ఆన్సర్‌పై డౌట్ ఉంటే!

By Mahesh· 6h ago· UGC
UGC NET ఆన్సర్ కీ రిలీజ్.. ఆన్సర్‌పై డౌట్ ఉంటే!

UGC NET జూన్ 2026 రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు ఆన్సర్ కీ అందుబాటులో ఉంది. క్యాండిడేట్లు NTA అఫీషియల్ <a href="https://ugcnet.nta.nic.in/">వెబ్‌సైట్‌లో</a> లాగిన్ అయి తమ రెస్పాన్స్ షీట్‌తో పాటు ఆన్సర్ ‘కీ’ని చెక్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రశ్నకు ఇచ్చిన ఆన్సర్ తప్పుగా ఉందని అనిపిస్తే సెప్టెంబర్ 13 రాత్రి 11:59 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఆబ్జెక్షన్ పెట్టొచ్చు. ఒక్కో ప్రశ్నపై ఛాలెంజ్ చేయడానికి రూ.200 ఫీజు పే చేయాలి.

More in Education

అభిజీత్ దిప్కే ట్వీట్ స్పందించిన గవర్నమెంట్..
Education· 1d ago

అభిజీత్ దిప్కే ట్వీట్ స్పందించిన గవర్నమెంట్..

మహారాష్ట్రలోని ఆదివాసీ ఆశ్రమ పాఠశాలల్లో కొత్త టాయిలెట్ల నిర్మిస్తున్నారు. ఈ స్కూళ్లలోని అధ్వాన పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని కోరుతూ CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే సోషల్ మీడియాలో <a href="https://www.theclearcutnews.com/n/JagAnsD">ట్వీట్</a> చేసి, CM దేవేంద్ర ఫడ్నవీస్‌ను విజిట్ చేయాలని కోరారు. దాంతో స్పందించిన ప్రభుత్వం తక్షణమే పాఠశాలల్లో టాయిలెట్ల ఇన్‌స్టాలేషన్ పనులను ప్రారంభించింది. ఎప్పుడో జరగాల్సిన ఈ పనులను ప్రభుత్వం ఇప్పటికైనా పూర్తి చేస్తుండడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పనులకు సంబంధించిన వీడియో తమ 'X' అకౌంట్ లో షేర్ చేశారు.