జిమ్‌లో సరదాగా స్టార్ట్ చేసి.. ప్రపంచ ఛాంపియన్‌గా

ఫిట్‌నెస్ కోసం జిమ్‌కు వెళ్లిన, హైదరాబాద్‌కు చెందిన అజయ్ బెనర్జీ.. కఠిన ట్రైనింగ్‌తో ఇంటర్నేషనల్ పవర్‌లిఫ్టర్‌గా ఎదిగారు. 45 ఏళ్ల అజయ్.. ఐటీ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 9 నుంచి 14 వరకు UKలోని మాంచెస్టర్‌లో జరిగిన వరల్డ్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 457.5 కేజీల వెయిట్ లిఫ్ట్ చేసి, గోల్డ్ మెడల్ సాధించారు. ఇప్పటివరకు నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్‌లో 10కిపైగా మెడల్స్ గెలుచుకున్నారు.

