BSNL ఆఫర్.. ఫ్రీ ఇన్సూరెన్స్!

గవర్నమెంట్ టెలికాం సంస్థ BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ పై ఫ్రీగా ఇన్సూరెన్స్, సైబర్ ఫ్రాడ్ కవరేజ్ ఆఫర్ చేస్తోంది. STV 202, STV 2449 ప్లాన్స్ రీఛార్జ్ చేసిన వెంటనే ఈ పాలసీ యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ ప్రమాదవశాత్తు చనిపోతే లక్ష రూపాయల వరకు ఇన్సూరెన్స్, అలాగే సైబర్ మోసాల బారిన పడితే 10 వేల రూపాయల వరకు కవరేజీ లభిస్తుంది. రీఛార్జ్ SMS లోనే ఇన్సూరెన్స్ డీటెయిల్స్ వస్తాయి. ఈ బెనిఫిట్ ఇస్తున్న ఫస్ట్ టెలికాం ఆపరేటర్ BSNL మాత్రమే.


