హైకోర్టులో BRS MLAల పిటీషన్.. DGPకి ఆదేశాలు

TG: అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు నిరసనలో BRS మహిళా ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులను గుర్తించాలని తెలంగాణ హైకోర్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP) C.V.ఆనంద్‌ను హైకోర్టు ఆదేశించింది. అసెంబ్లీ గేటు వద్ద జరిగిన నిరసనలో పోలీసు అధికారులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ BRS మహిళా ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేసినట్టు బీఆర్‌ఎస్ పార్టీ లీగల్ టీం తెలిపింది.


