లోకాయుక్తగా జస్టిస్ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం

AP : ఆంధ్రప్రదేశ్ నూతన లోకాయుక్తగా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని లోక్‌భవన్ దర్బార్ హాల్‌లో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించగా, CM చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో మంత్రి వాసంశెట్టి సుభాష్, హైకోర్టు జడ్జీలు, DGP హరీష్‌కుమార్ గుప్తా, అధికారులు హాజరయ్యారు.



