← Back to news

కాలేజ్ టైమ్‌కు RTC బస్సులు నడపాలి: AISB

By Anand· 1d ago· Chilamathur, Chilamathur, Sri Sathya Sai
కాలేజ్ టైమ్‌కు RTC బస్సులు నడపాలి: AISB

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి వచ్చే విద్యార్థుల కోసం కళాశాలల సమయానికి అనుగుణంగా RTC బస్సులు నడపాలని AISB జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. చిలమత్తూరు, లేపాక్షి మండలాలతో పాటు శ్రీరంగరాజుపల్లి ప్రాంతానికి చెందిన పలువురు విద్యార్థులు మారుమూల గ్రామాల నుంచి హిందూపురంలో విద్యనభ్యసించేందుకు వస్తున్నారని తెలిపారు. సరైన సమయానికి బస్సులు లేకపోవడంతో విద్యార్థులు కళాశాలలకు సమయానికి చేరుకోలేకపోతున్నారని చెప్పారు.

More in Local