← Back to news

కాసుల కోసం ప్రాణాలతో చెలగాటం

By dk· 6 Aug 2026· ఆదిలాబాద్ జిల్లా
కాసుల కోసం ప్రాణాలతో చెలగాటం

TG: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో ఏకంగా 22 మంది ప్రయాణికులను ఎక్కించుకున్న డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మన్నూరు-శాంతాపూర్ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దాసరి మధుకర్ అనే ఆటోడ్రైవర్ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని ప్రమాదకరంగా తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డ్రైవర్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు గుడిహత్నూర్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 8h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.