← Back to news

తెలంగాణలో ప్రైవేటీకరణపై స్పష్టత కావాలి: హరీష్ రావు

By Vishi· 2h ago· X
తెలంగాణలో ప్రైవేటీకరణపై స్పష్టత కావాలి: హరీష్ రావు

TG: BRS నేత హరీష్ రావు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లెటర్ రాశారు. తెలంగాణలో జరుగుతున్న ప్రైవేటీకరణపై జోక్యం చేసుకోవాలని కోరారు. ఢిల్లీలో మీరు LIC, విద్యుత్ రంగం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారని, అయితే తెలంగాణలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం TG-TRANSCO, TG_GENCO, SCCL, DISCOM లాంటి ముఖ్యమైన సంస్థలను ప్రైవేటీకరించబోతోందని చెప్పారు. ఇది ఎలా సరైందని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో మీ మ్యానిఫెస్టోకి, రాయ్‌పూర్ తీర్మానానికి ఇది వ్యతిరేకమని వివరించారు.

తెలంగాణలో ప్రైవేటీకరణపై స్పష్టత కావాలి: హరీష్ రావు

More in TG