'పని చేశాం.. ప్రచారం చేసుకోలేదు': భట్టి

TG: డిప్యూటీ CM మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో TSRTC–మెట్రో రైల్ కామన్ పాస్‌ను ఈరోజు లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్‌దే కీలక పాత్ర అని అన్నారు. HCU, IIIT, BHEL వంటి సంస్థలు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయన్నారు. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించిందన్నారు. ‘పని చేయడమే తప్ప ప్రచారం చేసుకోలేదు.. గత ప్రభుత్వాలు మాత్రం ప్రచారంపైనే బతికాయి’ అని భట్టి అన్నారు.


