← Back to news

CM విజయ్‌కు డీఎంకే మద్దతు

By విశీ· 12 Aug 2026· X
CM విజయ్‌కు డీఎంకే మద్దతు

కేంద్ర ప్రభుత్వం చేయాలని చూస్తున్న డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా టీవీకే ప్రభుత్వం తీసుకున్న తీర్మానానికి తమిళనాడు అసెంబ్లీ సమావేశంలో డీఎంకే మద్దతు తెలిపింది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ‘డీలిమిటేషన్ పేరుతో పార్లమెంటు సభ్యుల సంఖ్య తగ్గకూడదు. వచ్చే 25 ఏళ్లపాటు డీలిమిటేషన్ చేయకూడదనేదే మా స్టాండ్’ అని చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తీర్మానాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తమిళనాడుకు డీలిమిటేషన్ వల్ల నష్టం జరగకూడదని నిర్ణయించినట్టు తెలిపారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 12h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.