యువకుల రక్షణకు లోకేశ్ బిగ్ యాక్షన్

AP: ఉద్యోగాల పేరుతో థాయ్‌లాండ్ వెళ్లి మోసపోయి బ్యాంకాక్‌లో చిక్కుకున్న తెలుగు యువకులకు మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు. తమను బలవంతంగా మయన్మార్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని, వెంటనే రక్షించాలని బాధితులు సోషల్‌మీడియాలో వేడుకున్నారు. విషయంపై మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. బాధితుల ఆవేదనను అర్థం చేసుకున్నానని, వారిని సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. వారి రక్షణకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.



