← Back to news

చర్చిలో పేలుడు.. 10 మంది మృతి!

By Krishna· 7 Sept 2026· Apnews
చర్చిలో పేలుడు.. 10 మంది మృతి!

మెక్సికోలోని టెమాస్కల్సింగో పట్టణంలో సెప్టెంబర్ 6 రాత్రి మతపరమైన వేడుకల సందర్భంగా ఘోర ప్రమాదం జరిగింది. న్యూస్ట్రా సెనోరా డి లా లజ్ చర్చి సమీపంలో నిల్వ చేసిన పటాకుల సామగ్రి భారీగా పేలిపోయింది. దీంతో కనీసం 10 మంది మరణించగా, 64 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి చర్చి సమీపంలోని గోడ కూలిపోయింది. గాయపడిన వారిలో ఇద్దరు పాస్టర్లు కూడా ఉన్నారు. అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు కారణం ఇంకా తెలియలేదు.

More in International