మళ్లీ YSRCPలోకి విజయసాయిరెడ్డి?

AP: రాజ్యసభ సభ్యత్వానికి, రాజకీయాలకు హఠాత్తుగా దూరమైన YSRCP మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? మరోసారి జగన్‌తో కలవబోతున్నారా? ఈ టాపిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇటీవల విజయసాయిరెడ్డి సిగ్నల్ ఇవ్వడంతోపాటు సొంతంగా డిజిటల్ మీడియా వేదికను రెడీ చేసుకుంటుండటంతో ఆయన రీ-ఎంట్రీ ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఆయన మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకే వస్తారనే టాక్ నడుస్తోంది.



