22Aపై క్లారిటీ ఇచ్చిన పొంగులేటి.. ఏం చెప్పారంటే?

TG: 22A నిషేధిత భూముల అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. 22Aను తమ ప్రభుత్వం కొత్తగా తీసుకురాలేదని, 1999లోనే ఈ రూల్ అమల్లోకి వచ్చిందన్నారు. అసైన్డ్, గవర్నమెంట్ ల్యాండ్స్‌ను కాపాడేందుకే దీన్ని తీసుకొచ్చారని చెప్పారు. 2015 కోర్టు తీర్పు తర్వాత భూములను 5 కేటగిరీలుగా చేసి, 2016లో GO 121 ఇచ్చినా ప్రొసీజర్స్ ప్రకటించలేదన్నారు. 2017-2025 మధ్య 28,611 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.


