← Back to news

రైతు గెటప్‌లో గణపయ్య.. అదుర్స్!

By Bala· 1h ago
రైతు గెటప్‌లో గణపయ్య.. అదుర్స్!

వినాయకచవితి వేడుకలు ప్రతి ప్రాంతంలో గ్రాండ్‌గా జరుగుతున్నాయి. వెరైటీ రూపాల్లో గణనాథుల విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలం, బోరివంక పెద్ద ఒరియా వీధిలో శ్రీలక్ష్మీ గణపతి యూత్‌ అధ్వర్యంలో వ్యవసాయం బ్యాక్‌గ్రౌండ్‌లో తీర్చిదిద్దిన గణేశుడు ఆకట్టుకుంటున్నాడు. రైతు గెటప్‌లో గణపయ్యతో పాటు రెండు ఎద్దులు, నాగలి, పొలాల దృశ్యాలతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. అన్నం పెట్టే రైతన్నకు థ్యాంక్స్ తెలపడమే తమ ఉద్దేశమని శ్రీలక్ష్మీ గణపతి యూత్‌ కమిటీ సభ్యులు తెలిపారు.

More in Politics