ఈ ‘దారి’ద్రం తీరేదాకా..నిరసన తప్పదు
హైదరాబాద్‌లోని ఇమ్లిబన్–పుట్లిబౌలి అధ్వాన రోడ్డు పరిస్థితికి నిరసనగా ఓ వ్యక్తి చిత్రమైన ఆందోళన చేశాడు. ఈ రహదారిలో పెద్ద గుంతలో పడుకొని తన నిరసన తెలిపాడు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి కోటి, చాదర్‌ఘాట్ వైపు వెళ్లే ఈ రహదారి ఎప్పుడూ భారీ ట్రాఫిక్‌తో నిండి ఉంటుంది. ప్రమాదకరమైన గుంతలు, దెబ్బతిన్న రహదారి ఉపరితలం కారణంగా ప్రజలు చాలా కాలంగా కంప్లైంట్లు చేస్తున్నారు. అతను చేసిన ఈ నిరసన కారణంగా కొద్దిసేపు బండ్లు ఆగిపోయాయి. పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు.


