బలంగా వాయుగుండం.. భారీ వర్షాల అలర్ట్

బంగాళాఖాతంలో వాయుగుండం సుడి గాలులు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి. ఇది సెప్టెంబర్ 22న ఉత్తరాంధ్ర, ఒడిశా దగ్గర తీరం దాటేలా కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణలో 21, 22 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల వర్షం పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లకూడదు. కరెంటు స్తంభాలకు దగ్గరగా ఉండకూడదు. సెప్టెంబర్ 24 వరకూ బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లొద్దని IMD సూచించింది.



