AI డేటా సెంటర్ల మూమెంట్.. ఇన్‌స్టా అకౌంట్‌పై రిస్ట్రిక్షన్స్

AP: విశాఖలో AI డేటా సెంటర్ల రాకను వ్యతిరేకిస్తూ పోస్టులు చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ‘స్టాప్ వైజాగ్ డేటా సెంటర్స్’పై మెటా కంపెనీ రిస్ట్రిక్షన్స్ విధించింది. ఇప్పుడు ఈ అకౌంట్ ఇండియాలో ఓపెన్ కావట్లేదు. ఐటీ రూల్స్ ప్రకారం ఇలా చేసినట్లు మెటా తెలిపింది. ఐతే.. డేటా సెంటర్లను వ్యతిరేకిస్తూ చేసే అకౌంట్లను AP ప్రభుత్వం కావాలనే ఇండియాలో కనిపించకుండా చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఇది ప్రజా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.



