← Back to news

గాజా చిన్నారి కేసులో ట్విస్ట్.. తప్పు ఒప్పుకున్న ఆర్మీ!

By sahani· 20 Aug 2026· Bbc· Israel
గాజా చిన్నారి కేసులో ట్విస్ట్.. తప్పు ఒప్పుకున్న ఆర్మీ!

గాజాలో 2024లో ఐదేళ్ల పాలస్తీనా బాలిక హింద్ రజబ్‌తో పాటు కుటుంబం ఉన్న కారుపై తామే ఫైరింగ్ జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ మొదటిసారి అధికారికంగా ఒప్పుకుంది. దాడి నుంచి బతికిన హింద్ రక్షణ కోసం రెడ్ క్రెసెంట్‌కు ఫోన్ చేసి వేడుకున్న ఆడియో రికార్డింగ్ గ్లోబల్‌గా వైరల్ అయింది. ఈ ఘటనతో పాటు ఆమెను రక్షించేందుకు వెళ్లిన అంబులెన్స్‌పై జరిగిన అటాక్‌పై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌కు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆర్డర్స్ ఇచ్చింది. ఈ కన్నీటి కథ ఆధారంగా వచ్చిన ‘ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్’ మూవీ ఆస్కార్ రేసులో నిలిచింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 5h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.