← Back to news

సూర్యాపేటలో కార్డన్ సెర్చ్.. 50 వాహనాలు సీజ్!

By SAIDULU· 1d ago· Chiwemla, Suryapet, Suryapet
సూర్యాపేటలో కార్డన్ సెర్చ్.. 50 వాహనాలు సీజ్!

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అన్నదురై నగర్‌లో మంగళవారం సాయంత్రం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ చేశారు. డీఎస్పీ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో, రూరల్ సీఐ రాజశేఖర్ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. ఐదుగురు ఎస్సైలు సహా 50 మంది పోలీసులు పాల్గొన్నారు. కాలనీలోని ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. నివాసితుల వివరాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, వాహన పత్రాలు తనిఖీ చేశారు. ధ్రువపత్రాలు లేని 50 వాహనాలను సీజ్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేకంగా ఆరా తీశారు.

More in Local