బైక్ మెకానిక్‌పై రూ.66 వేల ఫైన్

కేరళం రాష్ట్రం తిరువనంతపురానికి చెందిన రెంజిత్ తన బైక్‌ను అనిల్‌కుమార్ మెకానిక్ షాప్‌లో రిపేర్ కోసం ఇచ్చాడు. అడ్వాన్స్ తీసుకున్న అతను లేటుగా రిపేర్ చేశాడు. బిల్లు ఇవ్వకుండానే బైక్ అప్పగించాడు. మూడు నెలల్లోనే ఇంజిన్ పాడైంది. పిస్టన్ తప్పుగా అమర్చడం వల్లే ఈ సమస్య వచ్చిందని గుర్తించిన రెంజిత్ కొల్లం కన్సూమర్ కమిషన్‌ను ఆశ్రయించాడు. బైక్ రిపేర్ సరిగ్గా చేయని మెకానిక్‌కు కమిషన్ రూ.66,752 జరిమానా విధించింది.



