దొంగతనం అనుమానం.. కుర్చీకి కట్టేసి కొట్టారు
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో దారుణం జరిగింది. దొంగతనం అనుమానంతో ఇంటి పనిమనిషిని కుర్చీకి కట్టేసి కొట్టేశారు. సెప్టెంబర్ 30న కోత్వాలి దేహాత్ పరిధిలోని నెక్స్రా కాలనీలో ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఉపాసన కంప్లైంట్‌తో ఆకాంక్ష, ఆషిష్, దీపిక, సోనీ, వాణిపై కేసు నమోదైంది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, నిందితుల కోసం వెతుకుతున్నారు.