శివాజీ పార్క్‌లో CJP నిరసన.. భారీగా చేరుతున్న యూత్
ముంబై శివాజీ పార్క్ దగ్గర CJP నిరసనకు యూత్ పెద్ద సంఖ్యలో చేరారు. చేతుల్లో త్రివర్ణ జెండాలు పట్టుకుని CEC జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘GADDAAR GYANU MUST GO’ అంటూ బ్యానర్ పెట్టుకుని నిరసన చేశారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ CJP ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. అక్కడ మీడియా, పోలీసులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన పోస్ట్‌ను CJP తన అఫీషియల్ X అకౌంట్‌లో షేర్ చేసింది.