CC రోడ్ల నిర్మాణ పనులకు MLA భూమిపూజ

కర్నూలు జిల్లాలోని కల్లూరు అర్బన్ పరిధిలో 37, 41 వార్డుల్లో 1.54 కోట్లతో చేపట్టనున్న CC రోడ్ల నిర్మాణ పనులకు పాణ్యం MLA గౌరు చరితరెడ్డి భూమిపూజ చేశారు. 37వ వార్డులోని శాంతినగర్ కాలనీలో 40లక్షలు, NTRనగర్‌లో 54లక్షలు, 41వ వార్డులోని అపూర్వహోమ్స్‌లో 60లక్షలతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. MLA శిలాఫలకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో AP విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కే.పార్వతమ్మ, రాఘవేంద్ర, మున్సిపల్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.



