రోహిత్ కెరీర్ ముగియనుందా?

భారత క్రికెట్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని BCCI సెలక్టర్లు జట్టులో మార్పులపై చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో హిట్ మ్యాన్‌ను ఇకపై వన్డేలకు ఎంపిక చేయకూడదనే అభిప్రాయం వ్యక్తమైనట్లు ప్రచారం జరుగుతోంది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశంపై సెలక్టర్లు, కోచ్ గౌతమ్ గంభీర్‌తో సమావేశం జరిగినట్లు వార్తలు వస్తుండగా, అధికారికంగా BCCI నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.



