← Back to news

సీఎం ‘కామెంట్స్‌పై బిజెపి నిరసన

By Bejjanki· 1d ago· Bejjanki, Bejjanki, Siddipet
సీఎం ‘కామెంట్స్‌పై బిజెపి నిరసన

సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీపై చేసిన ‘కామెంట్స్‌ను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మండల అధ్యక్షుడు కొలిపాక రాజు ఆధ్వర్యంలో సీఎం చిత్రపటాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. బీజేపీ అన్ని దేవుళ్లను సమానంగా ఆరాధిస్తుందని, రాముడిని కొలిచేవారు శివుడిని కొలవరనే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

సీఎం ‘కామెంట్స్‌పై బిజెపి నిరసన
సీఎం ‘కామెంట్స్‌పై బిజెపి నిరసన

More in Local