కేజీబీవీ ఎస్ఓ టెర్మినేషన్.. ఎల్హెచ్పీఎస్ ఫైర్

మహబూబాబాద్ జిల్లా కేజీబీవీ ఎస్ఓలపై వరుస టెర్మినేషన్లను నిలిపివేయాలని ఎల్హెచ్పీఎస్ డిమాండ్ చేసింది. రాష్ట్ర అధ్యక్షులు గూగులోతు భీమా నాయక్ మాట్లాడుతూ, కురవి మండలం నేరడ కేజీబీవీ ఎస్ఓ సరస్వతిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ లేకుండా చర్యలు సరికాదన్నారు. కక్షసాధింపు చర్యలు ఆపాలని, లేనిపక్షంలో ప్రజా సంఘాలతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.



