AI డేటా సెంటర్లకి కరెంటు, నీళ్లు ఎందుకు అవసరం?

మనం AIని ఒక ప్రశ్న అడిగితే.. దాని కోసం భారీ కంప్యూటర్లు పనిచేస్తాయి. వీటిలో AI కోసం ప్రత్యేకంగా చేసిన GPU చిప్స్ వేల సంఖ్యలో ఉండొచ్చు. ఇవి ఒకేసారి చాలా లెక్కలు వేయడంతో ఎక్కువ కరెంటు తీసుకుంటాయి. అదే సమయంలో వేడి కూడా ఎక్కువగా వస్తుంది. ఈ వేడిని తగ్గించేందుకు డేటా సెంటర్లలో cooling systems పనిచేస్తాయి. కొన్ని చోట్ల ఈ cooling కోసం నీటిని ఉపయోగిస్తారు. అందుకే AI యూజ్ పెరిగే కొద్దీ కరెంట్, నీటి అవసరం కూడా పెరుగుతోంది. IEA ప్రకారం 2025లో AI-focused <a href="https://www.theclearcutnews.com/n/N5oPWM4">డేటా సెంటర్ల</a> కరెంట్ యూజ్ 50% పెరిగింది.



