బుద్ధుని భార్య అగ్నిప్రవేశం గురించి తెలుసా?

రామాయణంలో సీతాదేవి అగ్నిపరీక్ష గురించి తెలుసు. అయితే బుద్ధుడి భార్య యశోధర అగ్నిపరీక్ష గురించి విన్నారా అని ప్రముఖ రచయిత, చిత్రకారుడు దేవదత్త పట్నాయక్ రాసిన<a href="https://www.facebook.com/share/p/1EUouNDTc3/"> ఫేస్‌బుక్ పోస్ట్</a> సంచలనంగా మారింది. చైనాకు వెళ్లిన సంస్కృత గ్రంథాల్లో సిద్ధార్థుడు రాజభవనాన్ని వదిలి వెళ్లే రోజు యశోధర గర్భవతి అయ్యింది. ఆ బిడ్డ ఆరేళ్ల తర్వాత పుట్టాడు. రాజు శుద్ధోదనుడు ఆమెను అనుమానించి, అగ్నిగుంటలో పడవేయమని ఆదేశించాడు. ఆమె పడగానే ఆ నిప్పు కొలనుగా మారిపోయింది. ఆమె నిజాయితీ నిరూపితమైంది. ఆమె రాజకుటుంబం వదిలి జ్ఞానోదయం పొందింది.



