విమానంలో ప్రయాణికుల ఫైటింగ్.. వీడియో వైరల్!
లండన్ నుంచి ఢాకాకు వెళ్తున్న బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు గొడవపడ్డారు. మాటామాటా పెరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఫైట్‌లో ఓ వ్యక్తి టీషర్ట్ చిరిగిపోయింది. విమానంలోని ఇతర ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. క్యాబిన్ సిబ్బంది, తోటి ప్రయాణికులు జోక్యం చేసుకుని గొడవను ఆపారు. ఈ ఫైటింగ్‌కు కారణం ఏమిటనేది తెలియలేదు. ఘటనపై విచారణ చేపట్టనున్నట్లు ఎయిర్‌లైన్స్ జనరల్ మేనేజర్ మహబూబుద్దీన్ అహ్మద్ తెలిపారు.

