టోల్‌గేట్ వద్ద తనిఖీలు.. షాకింగ్ ట్విస్ట్

AP: విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలంలోని దాకమర్రి జొన్నాడ టోల్‌గేట్ వద్ద గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి వస్తున్న ఓ కారులో లిక్విడ్ గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈగల్ టీమ్, భీమిలి పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కారులో లిక్విడ్ గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులు, ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి కారును సీజ్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.



