కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారు: గండ్ర

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారి సమస్యల పరిష్కారంలో మొండిచేయి చూపుతోందని BRS మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. భూపాలపల్లి జిల్లా సింగరేణి ఏరియాలోని KTK-8వ గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు.



