మసాలా దోసెలో చనిపోయిన ఎలుక ప్రత్యక్షం
ముంబై నగరం బోరివలిలోని ఒక హోటల్‌లో షాకింగ్ ఘటన జరిగింది. రాధాకృష్ణ హోటల్‌లో ఒక కస్టమర్ తింటున్న మైసూర్ మసాలా దోసెలో చనిపోయిన ఎలుక కనిపించింది. ఆ షాక్‌తో కస్టమర్ వాంతులు చేసుకున్నాడు. వెంటనే బోరివలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. FDA(Food and Drug Administration) దీనిపై విచారణ చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే అనేక హోటళ్లపై ఆహార భద్రత తనిఖీలు జరుగుతున్నాయి. కొన్ని హోటళ్ల లైసెన్స్‌లు సస్పెండ్ చేశారు.

