రోడ్డు ప్రమాదాల నివారణకు కలెక్టర్ ఆదేశాలు

జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు యాక్సిడెంట్స్ తగ్గించేందుకు అన్ని డిపార్ట్‌మెంట్స్ కలిసి పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. IDOC కాన్ఫరెన్స్ హాల్‌లో రోడ్డు సేఫ్టీ మీటింగ్ నిర్వహించిన ఆయన, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ‘బ్లాక్ స్పాట్స్’ గుర్తించి లైటింగ్, పెట్రోలింగ్ పెంచాలన్నారు. ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు, స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ చెక్ చేయాలని RDO అధికారులకు స్పష్టం చేశారు.





