← Back to news

పేదలందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు: ఎమ్మెల్యే

By A Srisailam· 2h ago· Farooqnagar (Ct), Farooqnagar, Ranga Reddy
పేదలందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు: ఎమ్మెల్యే

TG: అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. రేషన్ కార్డు కోసం ఏ పార్టీ నాయకుడి సిఫారసు అవసరం లేదన్నారు. అర్హులు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే అధికారుల పరిశీలన అనంతరం నిబంధనల ప్రకారం కార్డులు మంజూరవుతాయని తెలిపారు.

పేదలందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు: ఎమ్మెల్యే
పేదలందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు: ఎమ్మెల్యే

More in Local