సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: CM రేవంత్‌రెడ్డి

TG: సిరిసిల్ల బహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి గత BRS ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. గత పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని విమర్శించారు. చేనేతను నమ్ముకున్న కుటుంబాలను గత పాలకులు పట్టించుకోలేదని అన్నారు. KTR సిరిసిల్ల ప్రజల గురించి ఏనాడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. KCR ఫ్యామిలీ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని భారీగా ఆస్తులు సంపాదించిందని రేవంత్ ఆరోపించారు. గల్ఫ్‌లో తెలంగాణ కార్మికుల కష్టాలపైనా గత ప్రభుత్వం స్పందించలేదని అన్నారు.


