Open AIని హ్యాక్ చేసిన ఏపీ టెకీలు

APకి చెందిన మోహన్ పెదపాటి సహా ముగ్గురు టెక్ పరిశోధకులు Open AI బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లో కీలక లోపాన్ని గుర్తించారు. హర్ష్ జైశ్వాల్, మోహన్ పెదపాటి, రాహుల్ మైనీలు 72 గంటలు శ్రమించి ఓపెన్ ఏఐ ప్రైవేట్ రిపాజిటరీలోని లోపాన్ని గుర్తించి యాక్సెస్ పొందారు. తర్వాత ఈ విషయాన్ని Open AIకి చెప్పారు. లోపాన్ని సరిచేసిన ఓపెన్ ఏఐ.. ముగ్గురికి 6,500 డాలర్లు రివార్డుగా అందించింది. మోహన్ రాజమహేంద్రవరం సమీపంలోని కొండగుంటూరుకు చెందినవారు. 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ లో చదివారు.


