← Back to news

రేపల్లె ఘటనలో కలెక్టర్, SP జోక్యం చేసుకోవాలి

By VEMANNA· 1h ago· Sasnool, Yerravalli, Jogulamba Gadwal
రేపల్లె ఘటనలో కలెక్టర్, SP జోక్యం చేసుకోవాలి

జోగులాంబ గద్వాల జిల్లా రేపల్లెలో కులాంతర ప్రేమ వివాహం నేపథ్యంలో దళిత యువకుడి ఇంటిని బీసీ యువతి తరఫు వారు కూల్చేశారన్నది ఆరోపణ. ఈ మేరకు అఖిల పక్షాలు, బహుజన, ప్రజా సంఘాలు కలెక్టర్, SPకు మెమోరాండం ఇచ్చాయి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

More in Local