← Back to news

16 వేల మొక్కలతో సస్య గణపతి..!

By Jagadish· 18h ago· Andhra Pradesh
16 వేల మొక్కలతో సస్య గణపతి..!

అనకాపల్లి జిల్లా కాశింకోట మండలం సినసపల్లిలో ఎకో-ఫ్రెండ్లీ గణపతి కొలువుదీరాడు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా 16 వేల మొక్కలతో 16 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఈ ప్రత్యేక ప్రతిమను శ్రీదేవి ఎంటర్ ప్రైజస్ అనే సంస్థ ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4 వరకు మొక్కల గణపతిని దర్శించుకోవచ్చు. పూర్తి గ్రీన్ గణేషుడిగా కొలువుదీరిన మొక్కల గణపతిని చూసి మొక్కుకోవడానికి స్థానికులు పెద్ద ఎత్తున వస్తున్నారు. మీరూ మీ ఎకో-ఫ్రెండ్లీ గణపతిని Clearcut Newsకి పంపొచ్చు.

More in Local