← Back to news

21 అంగన్‌వాడీ కేంద్రాలకు 12 రకాల విత్తనాలు పంపిణీ

By DK· 1h ago
21 అంగన్‌వాడీ కేంద్రాలకు 12 రకాల విత్తనాలు పంపిణీ

పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలోని 21 అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలకు 12 రకాల కూరగాయల విత్తనాలను సాపిడ్ స్వచ్ఛంద సంస్థ ఉచితంగా పంపిణీ చేసింది. చింతూరు ఎస్టీ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ఆర్గనైజర్ అహ్మద్ అలీ విత్తనాలను అందజేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కూరగాయల తోటలు పెంచి, వాటి ద్వారా వచ్చే కూరగాయలతో పిల్లలకు రుచికరమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో విత్తనాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.

More in Local