బీఆర్ఎస్ నేత తల్లి మృతి.. నివాళి!

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్నగూడూరు గ్రామంలో విషాదం. సీనియర్ BRS నేత గాడిపల్లి వెంకన్న, జన్నయ్యల తల్లి గాడిపల్లి లక్ష్మి మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.



