← Back to news

వదిన తల నరికి చెట్టుకు వేలాడదీసిన మరిది!

By BK· 3 Aug 2026· Bihar
వదిన తల నరికి చెట్టుకు వేలాడదీసిన మరిది!

బిహార్‌లోని జెహనాబాద్ జిల్లా ఇమాద్‌పూర్‌లో ఇంటికి వచ్చిన మరిది కునాల్ కుమార్, వంట ఆలస్యమైందనే కోపంతో వదిన అన్షుదేవి (25)తో గొడవపడ్డాడు. ఆవేశానికి లోనైన కునాల్ కుమార్ తన వదినపై దాడి చేసి గొడ్డలితో నరికి చంపాడు. అంతటితో ఆగకుండా, నరికిన తలను ఇంటి సమీపంలోని మర్రిచెట్టుకు వేలాడదీశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, పోస్టుమార్టం నివేదిక అనంతరం తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 10h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.