తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. కొత్త స్పెషల్ ట్రైన్

AP: తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి–విశాఖపట్నం మధ్య వీక్లీ స్పెషల్ ట్రైన్ (08509)ను ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 10 వరకు నడపనుంది. ప్రతి ఆదివారం, గురువారం మార్నింగ్ 9.50 గంటలకు తిరుపతిలో బయల్దేరి నెక్స్ట్ డే మార్నింగ్ 6.30 గంటలకు విశాఖ చేరుతుంది. విశాఖ–తిరుపతి (08510) సర్వీస్ ఆగస్ట్ 17 నుంచి సెప్టెంబర్ 11 వరకు ప్రతి సోమ, శుక్రవారం నైట్ 7.40 గంటలకు బయల్దేరి నెక్స్ట్ డే ఈవెనింగ్ 6.45 గంటలకు తిరుపతి చేరుతుంది. ఈ రైలులో 22 కోచ్‌లు ఉంటాయి.



